తెలంగాణ

telangana

ETV Bharat / city

రేషన్‌ షాపుల్లో నేతల బొమ్మలు కాదు.. జీఎస్టీ బొమ్మలు పెట్టాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై జీవన్​రెడ్డి మండిపాటు

MLC Jeevanreddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బొమ్మల పంచాయితీ తప్ప అభివృద్ధి కనిపించడంలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ షాపుల్లో నేతల బొమ్మలు కాదని.. జీఎస్టీ బొమ్మ పెట్టాలన్నారు. రెండు ప్రభుత్వాలు దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసేందుకు పోటీ పడుతున్నాయని ఆయన మండిపడ్డారు.

Jeevanreddy
Jeevanreddy

By

Published : Sep 3, 2022, 4:27 PM IST

MLC Jeevanreddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసేందుకు పోటీ పడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రెండు ప్రభుత్వాల మధ్య బొమ్మల పంచాయితీ తప్ప అభివృద్ధి కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ షాపుల్లో నేతల బొమ్మలు కాదని.. జీఎస్టీ బొమ్మ పెట్టాలన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రజలపై ఈ ఎనిమిదేళ్లలో జీఎస్టీ ద్వారా రూ.3లక్షల కోట్ల భారం పడిందని చెప్పారు. జీఎస్టీ వల్ల ప్రజలకు పన్నుల భారం తప్పితే మరో ప్రయోజనం లేదన్నారు. రైతుబంధు సాకుతో ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలన్నింటిని ఆపేశారని విమర్శించారు. 2014కు ముందున్న వాటిని నిలిపివేసి పేర్లు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details