తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్​ బిల్లులను టెలిస్కోపిక్​ విధానంలోకి మార్చండి: జీవన్​రెడ్డి - mlc jeevan reddy wrote a letter to kcr onelectric bill

విద్యుత్​ బిల్లుల అంశమై సీఎం కేసీఆర్​కు ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి లేఖ రాశారు. బిల్లులను నాన్​టెలిస్కోపిక్​ నుంచి టెలిస్కోపిక్​ విధానంలోకి మార్చాలని ఎటువంటి అదనపు ఛార్జీలు వేయకుండా వాయిదాల వారీగా చెల్లింపునకు వినియోగదారులకు అవకాశం కల్పించాలని ఆయన లేఖ ద్వారా సీఎంకు విజ్ఞప్తి చేశారు.

mlc jeevan reddy wrote a letter to  cm kcr on electric bills
విద్యుత్​ బిల్లులను టెలిస్కోపిక్​ విధానంలోకి మార్చండి: జీవన్​రెడ్డి

By

Published : Jun 17, 2020, 4:51 PM IST

విద్యుత్​ బిల్లులను టెలిస్కోపిక్‌ విధానంలోకి మార్చాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టీ జీవన్‌ రెడ్డి లేఖ రాశారు. టెలిస్కోపిక్‌, నాన్‌ టెలిస్కోపిక్‌ విధానాలల్లో విద్యుత్తు బిల్లులు వేయడం ద్వారా ఎంత వ్యత్యాసం వస్తుందో ఆయన ఉదాహరణతో లేఖలో వివరించారు. కరోనా విపత్కర సమయంలో నాన్‌ టెలిస్కోపిక్‌ విధానంలో అధికంగా విద్యుత్తు బిల్లులు వేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

విద్యుత్​ బిల్లులను టెలిస్కోపిక్​ విధానంలోకి మార్చండి: జీవన్​రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టెలిస్కోపిక్‌ విధానంలోనే విద్యుత్​ వినియోగానికి బిల్లులు వేసేవారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాన్‌ టెలిస్కోపిక్‌ విధానాన్ని పాటిస్తున్నారని ఆరోపించారు. లాక్​డౌన్‌తో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అధిక విద్యుత్తు బిల్లులు చెల్లించడం ప్రజలకు భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్​ బిల్లులను టెలిస్కోపిక్‌ విధానంలోకి మార్చాలని, ఇతర ఏవిధమైన అదనపు ఛార్జీలుకాని, వడ్డీకాని వేయకుండా వాయిదాల విధానంలో చెల్లింపునకు వినియోగదారులకు అవకాశం ఇవ్వాలని జీవన్‌ రెడ్డి సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి

ABOUT THE AUTHOR

...view details