సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ విధానం ఏకపక్షంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటకానికి మాత్రమే పనికి వస్తోందని ఎద్దేవా చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించి ఉంటే సుందిళ్లకు సులభంగా నీటిని తరలించే అవకాశం ఉండేదని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం ఎత్తిపోతలతో ఖజానాపై రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. మీడియా సంపాదకులను తుమ్మిడిహట్టి వద్దకు తీసుకెళ్లాలని అన్నారు.
ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: జీవన్‌రెడ్డి - జీవన్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటకానికి మాత్రమే పనిచేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవనరెడ్డి ఎద్దేవా చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం చేస్తే సుందిళ్లకు సులభంగా నీటిని తరలించే అవకాశం ఉండేదని తెలిపారు. తుమ్మిడిహట్టికి మీడియా సంపాదకులను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: జీవన్‌రెడ్డి