రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన నడుస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నాచారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మెడల జ్యోతి మల్లికార్జున్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని విమర్శించారు.
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: జీవన్ రెడ్డి - నాచారంలో కాంగ్రెస్ ప్రచారం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాచారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస పాలన చేసేందేమి లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: జీవన్ రెడ్డి
తనను గెలిపిస్తే ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని అభ్యర్థి మెడల జ్యోతి మల్లికార్జున్ అన్నారు. పటేల్ కుంట చెరువు నిండా చెత్త కూరుకుపోయిందని... దాని ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పటేల్కుంటను మినీ ట్యాంక్ బండ్‌గా చేసి, మురుగు నీరు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచిన కాంగ్రెస్