తెలంగాణ

telangana

ETV Bharat / city

Jeevan Reddy Comments: 'సీఎం హోదాలో కేసీఆర్​ అలా మాట్లాడటం సిగ్గుచేటు..' - సీఎం హోదాలో కేసీఆర్​ అలా మాట్లాడటం సిగ్గుచేటు..

Jeevan Reddy Comments: కేంద్ర బడ్జెట్​తో పాటు సీఎం కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెరాస, భాజపాల వల్లే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్​.. అలా మాట్లాడటం సిగ్గుచేటని జీవన్​రెడ్డి విమర్శించారు.

MLC Jeevan Reddy Comments on cm kcr and union budget
MLC Jeevan Reddy Comments on cm kcr and union budget

By

Published : Feb 2, 2022, 3:54 PM IST

Jeevan Reddy Comments: రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లడానికి తెరాస, భాజపా.. రెండు పార్టీలూ పాత్రదారులేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌తో పాటు సీఎం కేసీఆర్‌ రాజ్యాంగం తిరగరాయాలన్న అంశంపై జీవన్​రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇంతకాలం భాజపాతో అంటకాగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రాష్ట్రానికి ఏమి సాధించారని జీవన్​రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ స్వలాభం కోసమే భాజపాతో కలిసి నడిచారని ఆక్షేపించారు. రాష్ట్రానికి తిరోగమనంలోకి తీసుకెళ్లేందుకు తెరాస, భాజపా పోటీ పడుతున్నాయని ధ్వజమెత్తారు.

అవినీతి బయటపడుతుందనే..

కేంద్ర బడ్జెట్‌లో రైతులకు మద్దతు ధరపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఆహార సబ్సిడీలో లక్ష కోట్లు కోత విధించారని, మోదీ ఉపాధి హామీ పథకం నిధుల్లోనూ కోత పెట్టారని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను సీఎం కేసీఆర్​ సాధించలేక పోయారని.. ఇది ఆయన అసమర్థతకు నిదర్శనమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను తనకు వచ్చే కమిషన్ల కోసం తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. కేవలం తన అవినీతి బయట పడుతుందనే.. జాతీయ హోదాపై కేంద్రాన్ని కేసీఆర్​ గట్టిగా అడగడం లేదన్నారు.

కేసీఆర్​ ఆ విషయం మరిచారా..?

"కొత్తగా భాజపాతో ఫైట్ అంటూ కేసీఆర్​ నాటకం ఆడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలనటం సరికాదు. రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రకారమే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని కేసీఆర్‌ మరిచారా..? ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తొలగించేందుకు కేసీఆర్, మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చు చేయలేదు. దళితుల పట్ల కేసీఆర్‌ కపట ప్రేమ చూపిస్తున్నారు. 317 జీవోను వ్యతిరేకిస్తే లాగులు ఊడతాయనటం.. సీఎం హోదాలో కేసీఆర్​ మాట్లాడటం సిగ్గుచేటు." - జీవన్​రెడ్డి, ఎమ్మెల్సీ

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details