తెలంగాణ

telangana

ETV Bharat / city

JEEVAN REDDY: 'రూ.10కోట్ల విలువైన భూమిని కోటి 25లక్షలకే ఎలా విక్రయిస్తారు..?' - MLC Jeevan Reddy on Pudur Khadi prathistan lands

జగిత్యాల జిల్లా పూడూర్ ఖాదీ ప్రతిష్ఠాన్ భూముల విక్రయంలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC JEEVAN REDDY) ఆరోపించారు. కోట్లాది రూపాయల భూమిని అధికార పార్టీ నాయకులు రహస్యంగా కొనుగోలు చేశారని విమర్శించారు. లేని పక్షంలో ఖాదీ ప్రతిష్ఠాన్ భూమిని స్వచ్ఛందంగా వదులుకోవాలని సవాల్ విసిరారు.

mlc-jeevan-reddy-alleged-that-there-were-irregularities-in-the-sale-of-pudur-khadi-prathistan-land-in-jagityal-district
'పూడూర్ ఖాదీ ప్రతిష్ఠాన్ భూముల విక్రయంలో అక్రమాలు'

By

Published : Jun 24, 2021, 4:43 PM IST

జగిత్యాల జిల్లా పూడూర్ ఖాదీ ప్రతిష్ఠాన్ భూమి విక్రయాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఖాదీ ప్రతిష్ఠాన్ భూముల విక్రయంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సుమారు రూ. పది కోట్ల విలువ గల భూమిని రూ. కోటి 25లక్షలకు మాత్రమే విక్రయించారని ఆయన ఆరోపించారు.

బహిరంగ వేలం లేకుండానే అధికార పార్టీ నాయకులు భూమిని కొనుగోలు చేశారని జీవన్ రెడ్డి విమర్శించారు. సదరు భూమి అమ్మకం రద్దు చేసే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి దీనిపై రెండోసారి లేఖ రాస్తున్నట్టు తెలిపారు. వందలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే పూడూరు ఖాదీ ప్రతిష్ఠాన్ భూమిలో.. ఆధునిక టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

"ఎవరి అనుమతి లేకుండా.. ప్రభుత్వ భూమిని ఎలా అమ్ముతారు. అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవాలి. లేని పక్షంలో ఎలాగైనా రద్దు చేపిస్తాం. ఖాదీ ప్రతిష్ఠాన్ భూమిని కొనుగోలు చేసే అధికారం గాని, అమ్మే అధికారంగాని ఎవరికి లేదు. దొంగ చాటు భూమిని కొన్నారు. ఆ భూమి ప్రాంతంలో ఆధునిక టెక్స్ టైల్​ పార్కుని ఏర్పాటు చేసి, పద్మశాలి కార్మికులకు ఉపాధి కల్పించాలి.

-- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇదీ చూడండి: Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?

ABOUT THE AUTHOR

...view details