ఓటు వేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు - mlc elections updates
09:03 March 14
స్థానికులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని తార్నాకలో భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలవు రోజు ఎన్నికలు ఎర్పాటు చేసినందుకు ఎలక్షన్ కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు. హిమాయత్‌నగర్‌లో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కె. నాగేశ్వర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వరంగల్ జిల్లా వేలేరులో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఓటేయగా... నర్సంపేటలో యువ తెలంగాణ అభ్యర్థి రాణిరుద్రమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఓటేశారు. వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఓటేశారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఓటు వేసేవారు ఈ వీడియో తప్పక చూడాలి