ఆంధ్రప్రదేశ్లోని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖ మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 21వ వార్డు.. బూత్ నెంబర్ 15లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అక్కడికి చేరుకున్నారు. ఆ విషయమై ఎన్నికల అధికారులను ప్రశ్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలగపూడి అక్కడికి చేరుకోగా ఎమ్మెల్యేను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఏపీ ఎమ్మెల్యే వెలగపూడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - TNSF President Pranab Gopal arrest
ఏపీలోని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖ మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ కేసు విషయంలో ఆయనను స్టేషన్కు తరలించారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. సమాచారం తెలుకున్న తెదేపా కార్యకర్తలు ఆయనను కలవడానికి తరలివస్తున్నారు.
ఏపీ ఎమ్మెల్యే వెలగపూడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వెలగపూడిని ఏ కేసులో అరెస్టు చేశారన్న విషయాన్ని పోలీసులు ఎవరికీ చెప్పడం లేదు. మీడియాను కూడా ఆయనతో మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వెలగపూడి కారు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు తరలివస్తున్నారు. ఆయనను ఏ కారణం చేత అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:జనవరిలో రామగుండం థర్మల్ ప్రాజెక్టు తొలి యూనిట్ ప్రారంభం