కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కాలనీవాసులతో మాట్లాడి కనీస శుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో రసాయనాన్ని పిచికారి చేశామన్నారు. ఇంకా ఏ ప్రాంతంలోనైనా స్ప్రే చేయని పక్షంలో.. తనకు గానీ, పారిశుద్ధ్య సిబ్బందికి గానీ తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు.. కాలనీల్లో వైరస్ నిర్మూలనకు చర్యలు చేపట్టామని తెలిపారు.
కాలనీల్లో రసాయన ద్రావణంతో ఎమ్మెల్యే పిచికారి - kukatpally mla news
కూకట్పల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్లో తానే స్వయంగా రసాయనాన్ని చల్లారు.
![కాలనీల్లో రసాయన ద్రావణంతో ఎమ్మెల్యే పిచికారి MLA SPRAY CHEMICAL in colony's](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6615899-thumbnail-3x2-mla.jpg)
రసాయనాన్ని పిచికారి చేసిన ఎమ్మెల్యే