కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్.. ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎలాంటి అనుమతి లేకుండా ఉదయం నుంచి ఆమరణ దీక్ష చేపట్టారు.
ఎమ్మెల్యే సీతక్క ఆమరణ నిరాహార దీక్ష.. - corona effect in telangana
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు.
ఎమ్మెల్యే సీతక్క ఆమరణ నిరాహార దీక్ష..
కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఇప్పటి వరకు వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బిల్లులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా చేస్తున్న దీక్షను గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి:కరోనా కల్లోలం : భార్య శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన భర్త