తెలంగాణ

telangana

ETV Bharat / city

మహిళలు, బాలికల రక్షణలో ప్రభుత్వం విఫలమైంది: సీతక్క - రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

బతుకమ్మ, బోనాలప్పడు ఆర్భాటాలు చేసే మహిళా ప్రజాప్రతినిధులు... మహిళలు, బాలికలపై దాడులు జరిగినప్పడు ముందుకు ఎందుకు రారని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. రాష్ట్ర మహిళ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

mla seethakka fire on government fail in women protection
మహిళలు, బాలికల రక్షణలో ప్రభుత్వం విఫలమైంది: సీతక్క

By

Published : Sep 29, 2020, 10:53 PM IST

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... రాష్ట్ర మహిళా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ ట్యాంక్​బండ్ పైనున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు మహిళ నాయకులు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఓ మహిళా నాయకురాలు స్పృహ తప్పి పడిపోయారు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు మహిళా నాయకురాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

బతుకమ్మ, బోనాల పండుగలప్పడు ఆర్బాటాలు చేసే మహిళ ప్రజా ప్రతినిధులు... మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు ఎందుకు రారని సీతక్క ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏడు సంవత్సరాలుగా మహిళా కమీషన్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిర్భయ తరహా ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నా... ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలు, యువతులు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదని ఆరోపించారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకురావడంలో విఫలమైందన్నారు. అందుకు మొయినాబాద్ బాలిక ఘటనే సాక్ష్యమన్నారు. ఆ ఘటనను స్థానిక తెరాస నాయకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

మహిళలు, బాలికల రక్షణలో ప్రభుత్వం విఫలమైంది: సీతక్క

ఇదీ చూడండి:మహిళలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి: ఎల్.రమణ

ABOUT THE AUTHOR

...view details