MLA Roja: అక్రమ మైనింగ్ పాల్పడుతున్నానంటూ వైకాపాలోని ఓ వర్గం తనపై దుష్ప్రచారం చేస్తోందని నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు.. ఇటీవల కొందరు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారన్నారు. డీజీపీతో తీసుకున్న ఫొటోలకు ఇతర వ్యాఖ్యలు జోడించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
MLA Roja: 'కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు.. సీఎం దృష్టికి తీసుకెళ్తా..' - ఎమ్మెల్యే రోజా తాజా వార్తలు
MLA Roja: ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి వైకాపాలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అక్రమ మైనింగ్ పాల్పడుతున్నానంటూ వైకాపాలోని ఓ వర్గం దుష్ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ విషయంపై చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. త్వరలోనే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వైకాపా ముసుగులో ఉన్న ప్రతిపక్ష నేతలు.. గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పేదల గృహనిర్మాణాన్ని నిలుపుదల చేసేందుకే కొందరు కుట్రలు పన్నుతున్నారని రోజా ఆరోపించారు.
ఇదీచూడండి:Restrictions in Hyderabad: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారా.. అయితే ఇవి మీకోసం!