తెలంగాణ

telangana

ETV Bharat / city

'దిల్లీలో హిందువులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలి' - దిల్లిలో హిందువులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

దిల్లీలో హిందువులు సురక్షితంగా ఉన్నారా అనే సందేహాం కలుగుతుందని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. హిందువులపై దాడులు జరుగుతుంటే కేజ్రీవాల్‌ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు.

'దిల్లీలో హిందువులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలి'
'దిల్లీలో హిందువులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలి'

By

Published : Feb 12, 2021, 10:22 PM IST

రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్న వారిపై దిల్లీలో దాడులు జరుగుతున్నాయని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ అన్నారు. నిందితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దాడులు జరుగుతుంటే కేజ్రీవాల్‌ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

మైనార్టీలకు అనుకూలంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడారని మండిపడ్డారు. రింక్‌శర్మపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం: నామ

ABOUT THE AUTHOR

...view details