అయోధ్యలో రామమందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్న సమయంలోనే ఫిలింనగర్లో రామాలయం శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని గోషామహల్ ఎంఎల్ఏ రాజా సింగ్ అన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ భాజపా నేత పల్లపు గోవర్ధన్ సొంత నిధులతో వినాయక నగర్లో నిర్మించనున్న రామాలయానికి.. శంకుస్థాపన పూజల్లో రాజాసింగ్ పాల్గొన్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమంలో బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజక వర్గానికే తలమానికంగా రామాలయాన్ని తీర్చిదిద్దుతామని గోవర్ధన్ అన్నారు.
ఫిలింనగర్లో రామాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్ శంకుస్థాపన - రాజాసింగ్ తాజా వార్తలు
హైదరాబాద్ ఫిలింనగర్లోని వినాయక నగర్లో నిర్మించనున్న రామాలయం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. జూబ్లీహిల్స్ డివిజన్ భాజపా నేత పల్లపు గోవర్ధన్ సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఫిలింనగర్లో రామాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్ శంకుస్థాపన ఫిలింనగర్లో రామాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్ శంకుస్థాపన