ఏపీలో అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రభుత్వానికి తనదైన శైలిలో చురకలంటించారు. పట్టణంలోని 8వ వార్డు శ్రీకంఠపురం ప్రచారంలో ఆయన మాట్లాడారు. హిందూపురంలోని నాయకులు తనని విమర్శించడం తగదని ఎమ్మెల్యే అన్నారు. స్థానికంగా లేకపోయినా.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ప్రజలకు సేవ చేస్తున్నానని ఆయన తెలిపారు.
నన్ను విమర్శిస్తే ఊరుకోను.. బాలకృష్ణ హెచ్చరికలు
ప్రజాసేవ చేస్తున్న తనను విమర్శిస్తే ఊరుకోబోనని ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రెండేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పే ధైర్యం కూడా అధికార పార్టీకి లేదన్నారు.
నన్ను విమర్శిస్తే ఊరుకోను
నటనతో ప్రజలకు వినోదంతో పాటు మంచి సందేశం అందిస్తున్నానని పేర్కొన్నారు. నియోజకవర్గం సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీసి.. వాటి పరిష్కారానికి కృషి చేయడం సమాజసేవ కాదా..? అంటూ ప్రశ్నించారు. స్థానికంగా ఉండే నాయకులు ఎంత మేరకు అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నది మంత్రులు, ఎమ్మెల్యేలు కాదని.. ఇసుక, లిక్కర్ మాఫియా వాళ్లంటూ విమర్శించారు. రెండేళ్లలో వైకాపా ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు లేదని మండిపడ్డారు.
- ఇదీ చదవండి :కాసేపట్లో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష