కుండపోత వర్షానికి హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌లోని మహ్మద్ నగర్లో ఓ ఇల్లు కూలిపోయింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వానకు కూలిన ఇల్లు.. ఆదుకున్న ఎమ్మెల్యే - ముషీరాబాద్
నగరంలో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్ పూర్లోని మహ్మద్ నగర్లో ఓ ఇల్లు కూలింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు. ఇంట్లో ఉన్న వస్తువులు, సరుకులు నీటి పాలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించారు.

వానకు కూలిన ఇల్లు.. ఆదుకున్న ఎమ్మెల్యే
సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే.. భాజపా నేతలు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. భాజపా నేతలు తప్పుడు ప్రచారాలు మానుకొని.. ప్రజలకు అండగా ఉండాలని హితవు పలికారు.
ఇదీ చదవండి.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కమిషనర్