'సమాజంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయిద్దాం.. రాష్ట్రం నుంచి పోలియో మహమ్మారిని తరిమికొడదామని' ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కవాడిగూడలోని డీబీఆర్ మిల్స్ ప్రభుత్వ ఆస్పత్రి, బోలక్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి, గాంధీ నగర్ వార్డ్ ఆఫీస్ బస్తీ దవాఖానా, దోమలగూడలోని గగన్ మహల్ ప్రాథమిక ఆరోగ్య ప్రభుత్వ ఆసుపత్రి, బోలక్ పూర్ రంగ నగర్ బస్తీ దవాఖానా, తాళ్ల బస్తి కమ్యూనిటీ హాల్‌లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.