ముషీరాబాద్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ జెమిని కాలనీ, పోచమ్మ దేవాలయం, ముషీరాబాద్ ఫిష్ మార్కెట్, సాయి రెడ్డి స్ట్రీట్ డ్రైనేజ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశం - hyderabad latest news
ముషీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరిశీలించారు. రాంనగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్డు పనులను గమనించిన ఆయన... త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశం
కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు ముఠా జై సింహ, సుధాకర్ గుప్తా, ఎర్రం శేఖర్, ఇంద్రసేనా రెడ్డి, గోక నవీన్, దీన్ దయాల్ రెడ్డి, నేతా శీను, సయ్యద్ అస్లాం, మాధవ్, మీసాల ప్రసాద్, నర్సింగ్ ప్రసాద్, శ్రీను, బాలు, పాండు, రాజేష్, శ్రీకాంత్ వాటర్ వర్క్స్ అధికారులు జీఎమ్ మహేష్, జీహెచ్ఎంసీ ఏఈ మురళి, మేనేజర్ అఖిమ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:చేపల చెరువులో కొండ చిలువ కలకలం..!