భవిష్యత్తులో హైదరాబాదులోనే అతి పెద్ద మార్కెట్ యార్డుగా పటాన్చెరు మార్కెట్ రూపుదిద్దుకోనుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మార్కెట్ యార్డులో మలక్‌పేట హోల్‌సెల్ ఉల్లిపాయల వ్యాపారుల కోసం నిర్మించిన 30 షెడ్లను ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో కలిసి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పశువుల సంత బ్రోచర్‌ను విడుదల చేశారు.
'హైదరాబాదులోనే అతి పెద్ద మార్కెట్ యార్డుగా పటాన్చెరు' - charminar news
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డులో ఉల్లిపాయల వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన 30 షెడ్లను ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పశువుల సంత బ్రోచర్‌ను విడుదల చేశారు. మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

mla mahipalreddy integrated 30 sheds in patancheru market mla mahipalreddy integrated 30 sheds in patancheru market
చార్మినార్ మాదిరిగా పటాన్చెరు మార్కెట్ యార్డుకు నాలుగు రహదారులు ఉన్నాయన్నారు. పక్కన ఉన్న రైల్వే స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ అనుమతితో స్వాధీనం చేసుకోనున్నామని.. అలాగే ఇదే మార్కెట్లో పశువుల సంత కూడా నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొత్త రాష్ట్రం వచ్చాకే మార్కెట్ యార్డు ఏర్పాటైందని... ఇది పటాన్చెరు ప్రజల అదృష్టమన్నారు. మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వరదలతో పాటే వ్యాధులు... పొంచి ఉన్న డయేరియా, మలేరియా, డెంగీ..