MLA Krishna Rao Challenges Bandi Sanjay : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఛాలెంజ్ విసిరారు. చెరువుల కబ్జాపై విచారణకు సిద్ధమని సవాల్ చేశారు. భాజపా ఎమ్మెల్యేలలో ఒకరిని పంపిస్తే బహిరంగంగా ఈ విషయంపై చర్చిద్దామన్నారు. తాను కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని అన్నారు. కాషాయ నేతలు కబ్జాలకు పాల్పడినట్లు రుజువైతే మాత్రం బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆ పని చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - బండి సంజయ్‌కు ఎమ్మెల్యే కృష్ణారావు ఛాలెంజ్
MLA Krishna Rao Challenges Bandi Sanjay : తాను భూ కబ్జాలకు పాల్పడుతున్నానంటూ భాజపా నాయకులు చేసిన ఆరోపణలను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఖండించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని దమ్ముంటే భాజపా ఎమ్మెల్యేలను పంపించమని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. తాను కబ్జా చేసినట్లు రుజువైతే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
![ఆ పని చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు MLA Krishna Rao Challenges Bandi Sanjay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16375858-664-16375858-1663229219118.jpg)
MLA Krishna Rao Challenges Bandi Sanjay
నేను ఆ పని చేశానని రుజువైతే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి నియోజవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌లో ఆసరా పింఛన్లను 800 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు భాజపా పాల్పడుతోందని ఆరోపించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును బండి సంజయ్ చదువుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేవరకు కమలదళాన్ని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.