తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ ప్రభుత్వ జీవోలపై న్యాయపోరాటం: కర్నె - పోతిరెడ్డిపాడు వార్తలు

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాతం చేస్తున్నాయని ప్రభుత్వ విప్​ కర్నె ప్రభాకర్​ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

karne prabhakar
ఏపీ ప్రభుత్వ జీవోలపై న్యాయపోరాటం: కర్నె

By

Published : Aug 7, 2020, 6:45 PM IST

Updated : Aug 7, 2020, 7:35 PM IST

కోర్టులపై తమకు నమ్మకం ఉందని.. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ప్రతిపాదనపై న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వ విప్​లు కర్నె ప్రభాకర్, గువ్వల బాలరాజు వెల్లడించారు. ఏపీని వదిలి కర్ణాటకపై పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి లాలూచీ లేదని... రాష్ట్ర ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును తెరాస ముందు నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో నీటి తరలింపును సమర్థించిన కాంగ్రెస్​ నేతలు.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని కర్నె ధ్వజమెత్తారు. ఆనాడు ఆంధ్రా నేతలకు మంగళ హారతులు పట్టిన డీకే అరుణ వంటి నేతలు.. ఇప్పుడు గొంతు చించుకొని మాట్లాడుతున్నారని గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు. ప్రాజెకుల నిర్మాణంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వ జీవోలపై న్యాయపోరాటం: కర్నె

ఇవీచూడండి:నీళ్లమీద మాకున్న చిత్తశుద్ధి వారికెక్కడిది..: నిరంజన్​రెడ్డి

Last Updated : Aug 7, 2020, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details