MLA Selected for Teacher: గతంలో 1998లో డీఎస్సీ రాసిన ప్రస్తుత చోడవరం వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 23 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. డీఎస్సీ వివాదం న్యాయస్థానంలో పరిష్కారం కావడంతో అప్పట్లో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల ఫైల్‌పై ఏపీ సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో ధర్మశ్రీ పేరు కూడా ఉంది. బీఏ సోషల్, ఇంగ్లీష్ పోస్టుకు గానూ ధర్మశ్రీ 1998లో ఉపాధ్యాయ పరీక్ష రాశారు. అనుకోని కారణాలు, కోర్టు వివాదల వల్ల 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అనంతరం ధర్మశ్రీ రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో చురుగ్గా పనిచేశారు. మాడుగుల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున మెుదటి సారి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
డీఎస్సీ 1998 క్వాలిఫై అయినట్లు నాకు కూడా తెలిసింది. అప్పుడే ఉద్యోగం వచ్చుంటే ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండేవాడిని. ఇప్పుడేమో గడప గడపకు తిరుగుతున్నా. అప్పట్లో ఇంటర్వ్యూలో నేను క్వాలిఫై అయ్యా. అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడంతో అది ఆపేశారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదు. అప్పుడు అనేక వివాదాలతో వాయిదా పడింది. ఈరోజు జగన్ నిర్ణయంతో చాలామందికి మేలు జరిగింది.