తెలంగాణ

telangana

ETV Bharat / city

MLA Jeevan Reddy: 'ఏపీలో మాదిరిగా మేం చేయాలనుకుంటే 30 సార్లు దాడి చేయాలి' - జీవన్​ రెడ్డి వార్తలు

భాజపా ఎంపీ అర్వింద్​పై ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి (MLA Jeevan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేటీఆర్​పై మరోసారి డ్రగ్స్ ఆరోపణలు చేస్తే కేసులు వేస్తామని హెచ్చరించారు. ఏపీలో జరిగిన దాడులపై స్పందించారు.

MLA Jeevan Reddy
MLA Jeevan Reddy

By

Published : Oct 20, 2021, 5:21 PM IST

ఆంధ్రప్రదేశ్​లో మాదిరిగా తాము చేయాలనుకుంటే ముప్ఫైసార్లు దాడి చేయాలని అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్, ఆర్మూరు శాసనసభ్యుడు జీవన్ రెడ్డి (MLA Jeevan Reddy) వ్యాఖ్యానించారు. కేసీఆర్​పై చేసిన వ్యాఖ్యలకు పార్టీల కార్యాలయాలను పెకిలివేయాల్సి ఉండేదన్నారు. కానీ ఏడున్నరేళ్లల్లో ఎప్పుడైనా గాంధీభవన్, భాజపా కార్యాలయాలకు వెళ్లామా.. తెదేపా కార్యాలయంపై రాళ్లు వేశామా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తమకు నేర్పించిన క్రమశిక్షణ, సంస్కృతి, మంచితనం అలాంటిదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

'పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి. ఏపీ మాదిరిగా మేం చేయాలనుకుంటే 30 సార్లు దాడి చేయాలి. కేసీఆర్‌పై వ్యాఖ్యలకు పార్టీ కార్యాలయాలను కూల్చివేయాలి. ఏడున్నరేళ్లలో గాంధీభవన్, భాజపా కార్యాలయాలకు వెళ్లామా? మాకు కేసీఆర్ నేర్పిన క్రమశిక్షణ, సంస్కృతి అలాంటిది. మా సంస్కృతి, మంచితనం, క్రమశిక్షణ గురించి చెబుతున్నా.'

-జీవన్​ రెడ్డి

దమ్ముంటే నాపై పోటీ చేయ్​

అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడమే తమ లక్ష్యమని జీవన్​ రెడ్డి (MLA Jeevan Reddy) అన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్​కు (BJP MP ARVIND) దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. కేటీఆర్​పై (KTR) మరోసారి డ్రగ్స్ ఆరోపణలు చేస్తే అర్వింద్​పై కేసులు వేస్తామని హెచ్చరించారు. కవితను కించపరిస్తే నిజామాబాద్ మహిళలు చెప్పులు, చీపుళ్లతో కొడతారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి, అర్వింద్ న్యూసెన్స్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

ఆ స్థాయి రేవంత్​ రెడ్డికి లేదు

మంత్రి కేటీఆర్‌తో పోల్చుకునే స్థాయి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) లేదని జీవన్‌ రెడ్డి అన్నారు. అర్వింద్‌ స్టంట్ మాస్టర్.. రేవంత్‌రెడ్డి టెంట్ మాస్టర్ అని విమర్శించారు. తెలంగాణలో టెంటు, స్టంటు రాజకీయాలు నడవవని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అందజేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

'ఏపీ మాదిరిగా మేం చేయాలనుకుంటే 30 సార్లు దాడి చేయాలి'

ఇదీ చదవండి :Mp Arvind Comments: 'కేసీఆర్... దళితబంధు సాధ్యం కాదని నీ ఆఫీసరే చెప్పిండు'

Samantha Defamation Suit: కూకట్​పల్లి కోర్టులో సమంత పరువునష్టం దావా...

ABOUT THE AUTHOR

...view details