ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(MP Vs MLA) సొంత పార్టీ ఎంపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో వైకాపాను ఎంపీ భరత్(MP Vs MLA) సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా ఎమ్మెల్యే(MP Vs MLA)తో కలిసి భరత్ కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ను ఇబ్బందిపెట్టిన వి.వి.లక్ష్మీనారాయణతో భరత్ సెల్ఫీ తీసుకోవడమేంటని రాజా ప్రశ్నించారు. రౌడీషీటర్లు, భూకబ్జాదారులతో భరత్ జత కట్టారని విమర్శించారు. ఎంపీ భరత్ తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు.
MP Vs MLA : సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు - ap news
ఏపీలోని రాజమహేంద్రవరంలో వైకాపాను ఎంపీ భరత్(MP Vs MLA) సర్వనాశనం చేస్తున్నారని రాజానగరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. తెదేపాతో కలిసి కుమ్మక్కై కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
'రాజమహేంద్రవరంలో వైకాపాను భరత్(MP Vs MLA) సర్వనాశనం చేస్తున్నారు. తెదేపా ఎమ్మెల్యేతో కలిసి భరత్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టిన వి.వి.లక్ష్మీనారాయణతో సెల్ఫీయా..? ఎంపీ భరత్‌తో రౌడీషీటర్లు, భూకబ్జాదారులు ఉన్నారు. ఎంపీ భరత్ తన తీరు మార్చుకోవాలి '
- జక్కంపూడి రాజా,వైకాపా ఎమ్మెల్యే
TAGGED:
ఎంపీ భరత్ తాజా వార్తలు