తెలంగాణ

telangana

ETV Bharat / city

Jaggareddy letter to CM KCR: కేసీఆర్​కు జగ్గారెడ్డి 12 గంటల డెడ్​లైన్​... లేకుంటే - Jaggareddy wrote a letter to kcr

Jaggareddy letter to CM KCR: సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్​ ఫలితాల్లో నెలకొన్న గందరగోళపై ప్రభుత్వం పునరాలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంటర్​బోర్డు ముందు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు.

MLA Jaggareddy wrote a letter to cm kcr on inter results
MLA Jaggareddy wrote a letter to cm kcr on inter results

By

Published : Dec 22, 2021, 3:32 PM IST

Jaggareddy letter to CM KCR: ఇంటర్​ ఫలితాల విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి ముగింపు పలకాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలైన ఫలితాలతో విద్యార్థులు, తల్లితండ్రులు చాలా ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు రహదారులపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు.

jaggareddy protest: కొంతమంది విద్యార్థులు మనస్తాపంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం 12 గంటల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. రేపు ఇంటర్ బోర్డు ముందు దీక్షకు కూర్చుంటానని తెలిపారు. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. మరోవైపు.. విద్యార్థులెవరూ కుంగిపోవద్దని సూచించారు. ఆత్మస్థైర్యంతో ఉండాలని.. ఆత్మహత్యలు చేసుకోవద్దని జగ్గారెడ్డి ధైర్యం చెప్పారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details