Jaggareddy Greets Revanth Reddy: సీఎల్పీ కార్యాలయంలో అనూహ్య సంఘటన ఎదురైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇటీవలికాలంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సమాచారం ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి పర్యటించారని ఇరువురి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి.
Jaggareddy Greets Revanth Reddy : 'హలో తమ్ముడూ'.. అంటూ రేవంత్‌కు జగ్గారెడ్డి పలకరింపు - రేవంత్ రెడ్డిని పలకరించిన జగ్గారెడ్డి
Jaggareddy Greets Revanth Reddy: సీఎల్పీ కార్యాలయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. భిన్నధ్రువాలపైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇటీవల రేవంత్‌పై తెగ మండిపడుతున్న జగ్గారెడ్డి.. ఆయన ఎదురుపడగానే ఆప్యాయంగా పలకరించడం అక్కడి కాంగ్రెస్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
Jaggareddy Talks to Revanth: ఈ నేపథ్యంలో సీఎల్పీలో రేవంత్‌రెడ్డి ఎదురుపడగానే జగ్గారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం 20 నిమిషాల పాటు ఇద్దరు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు, పార్టీకి తన రాజీనామా విషయంపై చర్చించారు. ఇప్పట్లో పార్టీకి రాజీనామా చేయనని.. కాంగ్రెస్ బలోపేతానికి రేవంత్‌తో పాటు కృషి చేస్తానని టీపీసీసీ చీఫ్‌కు జగ్గారెడ్డి మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరి భేటీ అనంతరం బయటకు వచ్చిన జగ్గారెడ్డిని చూసి కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుకున్నారని అడగ్గా.. 'అది సీక్రెట్ బయటకు చెప్పను' అని అన్నారు.