ఆర్టీసీ జేఏసీ కార్మికుల డిమాండ్ల సాధనకోసం రేపు తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ మిలీనియం మార్చ్‌ని విజయవంతం చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. సీఎల్పీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన తెలంగాణ సాధన కోసం గతంలో జరిగిన మిలీనియం మార్చ్ మాదిరిగానే జరిగినట్లే చూడాలని పీసీసీ సూచించినట్లు వివరించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు అధికమయ్యాయని...పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో భయాందోళనలకు గురి చేస్తోందని ఆరోపించారు. ఎల్లకాలం సీఎం కేసీఆర్ అధికారంలో ఉండడని...కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే పోలీసులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయస్థానం ద్వారా న్యాయం జరిగి తీరుతుందని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
"పోలీస్ వ్యవస్థ భయపెడుతోంది... గుణపాఠం తప్పదు" - MLA jagga reddy serious comments on police department today news
పోలీస్ వ్యవస్థ భయాందోళనలకు గురి చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయస్థానం ద్వారా న్యాయం జరిగి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
MLA jagga reddy serious comments on police department