తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఇప్పుడు షర్మిలా... రేపు జూనియర్​ ఎన్టీఆర్​'... జగ్గారెడ్డి జోస్యం - mla jagga reddy latest comments on sharmila party

వైకాపా, తెరాస, భాజపా... మూడు కలిసి కాంగ్రెస్​ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే కుట్ర పన్నుతున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఇప్పుడు షర్మిల వచ్చిందని... రేపు జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి కూడా పార్టీ పెట్టొచ్చని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.

mla jagga reddy reacted on sharmila new party in telangana
mla jagga reddy reacted on sharmila new party in telangana

By

Published : Feb 10, 2021, 5:00 PM IST

Updated : Feb 10, 2021, 7:16 PM IST

'ఇప్పుడు షర్మిలా... రేపు జూనియర్​ ఎన్టీఆర్​'

భాజపా డైరెక్షన్​లోనే వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ ఇప్పటికే భాజపాతో కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్న జగ్గారెడ్డి... తెదేపా గోడమీద పిల్లిలా ఏటు తేల్చుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. వైకాపా, తెరాస, భాజపా... మూడు కలిసి కాంగ్రెస్​ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే కుట్ర పన్నుతున్నాయని ఆక్షేపించారు.

"ఉత్తరాదిలో పట్టు కోల్పోతున్నందునే... భాజపా దక్షిణ భారత్​పై దృష్టి పెట్టింది. కాంగ్రెస్​కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బలమైన కంచుకోట. సెటిలర్స్​ను షర్మిల వైపు తిప్పుకొనేందుకే కొత్త పార్టీ పెడుతున్నారు. కాంగ్రెస్​లో తమలాంటి వారెందరో వైఎస్​కు వారసులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ నుంచి విడదీయడానికే షర్మిలను భాజపా రంగంలోకి దించింది. ఇప్పుడు షర్మిల వచ్చారు... రేపు జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి కూడా పార్టీ పెట్టొచ్చు."

Last Updated : Feb 10, 2021, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details