MLA Amarnath on Spy software: నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఏపీ ప్రభుత్వం వాడుతోందని.. వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు.. రాష్ట్ర భద్రత కోసమే నిఘా వ్యవస్థల్ని వినియోగిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత అంశాలు తెలుసుకునేందుకు కాదని చెప్పారు.
లోకేష్ ఎందుకు తడబడుతున్నారు..?
పెగాసెస్ స్పైవేర్ వ్యవహారంలో.. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని.. అమర్నాథ్ విమర్శించారు. మమతా బెనర్జీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోతే.. నారా లోకేష్ ఎందుకు తడబడుతున్నారని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావుది ఇండియన్ పోలీసు సర్వీసు కాదు.. ఇజ్రాయెలీ పెగాసెస్ సర్వీసు అని ఎద్దేవా చేశారు.
నిఘా సాఫ్ట్‌వేర్‌ను మా ప్రభుత్వం వాడుతోంది: ఎమ్మెల్యే ఇదీ చదవండి:చంద్రబాబు పెగాసస్ కొన్నారు: మమతా బెనర్జీ