తెలంగాణ

telangana

ETV Bharat / city

MLA Etela Fires on KCR: 'కేసీఆర్​కు.. అధికారం చేతిలో ఉందనే అహంకారం పనికిరాదు' - Huzurabad MLA etela rajender

MLA Etela Fires on KCR: పోలీసు వ్యవస్థ, కలెక్టర్లు తన చేతిలో ఉన్నారన్న అహంకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్​ గౌలిదొడ్డిలో వారం క్రితం అధికారులు కూల్చివేసిన గుడిసెవాసులను స్థానిక భాజపా నేతలతో కలిసి పరామర్శించారు. వారికి కమలం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

MLA Etela Fires on KCR
MLA Etela Fires on KCR

By

Published : Dec 17, 2021, 10:13 AM IST

తెరాస సర్కార్​పై ఈటల ఫైర్

MLA Etela Fires on KCR : హైదరాబాద్​ గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని బసవతార్​నగర్​లో వారం క్రితం అధికారులు కూల్చివేసిన గుడిసెవాసులను హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. స్థానిక భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే భిక్షపతితో కలిసి వారి వద్దకు వెళ్లారు. ప్రస్తుతం వారి పరిస్థితులపై ఆరా తీశారు.

MLA Etela Fires on CM KCR : బతుకుదెరువు కోసం 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి గుడిసెలు వేసుకుని నివాసముంటున్న వారిని ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా గెంటేశారని.. వారి గుడిసెలను కూల్చివేశారని అధికారులపై ఈటల మండిపడ్డారు. రాళ్లు కొట్టుకుని బతికేవారిపై ప్రతాపం చూపించడమేంటని ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనుల వల్ల పేదోళ్ల ఉసురు తగిలి పోతారని అన్నారు.

MLA Etela Fires on KCR Today : తన చేతిలో పోలీసు వ్యవస్థ, కలెక్టర్లు ఉన్నారన్న అహంకారంతో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఈటల దుయ్యబట్టారు. మానవత్వం ఉంటే.. ఇప్పటికైనా బాధితులకు డబుల్ బెడ్​రూం ఇళ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు భాజపా అండగా ఉంటుందని అన్నారు. వారి కోసం ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని.. అవసరమైతే పోరాటం చేస్తామని చెప్పారు.

MLA Etela Comments on KCR : మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు.. ఇక్కడున్న పేదలకు అండగా ఉండి రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారని ఈటల గుర్తుచేశారు. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి తీసుకుని నోరుమెదపకుండా ఉన్నారని విమర్శించారు. అక్కడున్న గుడిసెలకు.. ఆ పేదవాళ్లకు భాజపా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details