తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష విధించిన ప్రజాప్రతినిధుల కోర్టు - telangana varthalu

MLA Danam Nagendra
MLA Danam Nagendra

By

Published : Jul 7, 2021, 5:20 PM IST

Updated : Jul 7, 2021, 6:19 PM IST

17:16 July 07

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష విధించిన ప్రజాప్రతినిధుల కోర్టు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్​కు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. బంజారాహిల్స్​లో 2012లో కారుకు అడ్డు వచ్చిన ఓ పోలీసుపై దాడి చేసి బెదిరించారన్న అభియోగంపై దానం నాగేందర్​తో పాటు చట్నీ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు నుంచి ఇటీవల ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి అభియోగపత్రం బదిలీ అయింది. 

   విచారణ జరిపిన ప్రజా ప్రతినిధుల కోర్టు దానం నాగేందర్​పై ఐపీసీ 323 సెక్షన్ కింద అభియోగాలు రుజువైనట్లు ప్రకటించింది. దానం నాగేందర్​కు ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించిన కోర్టు.. జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అప్పీలు చేసుకునేందుకు వీలుగా దానం నాగేందర్​పై శిక్షను నెల రోజుల పాటు నిలిపివేసింది.

ఇదీ చదవండి: KISHAN REDDY : సహాయ మంత్రి నుంచి కేబినెట్​ మంత్రిగా కిషన్ రెడ్డి

Last Updated : Jul 7, 2021, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details