తెలంగాణ

telangana

ETV Bharat / city

ఐపీఎల్​లో తెలంగాణ క్రీడాకారులకు తీవ్ర అన్యాయం: దానం - జూబ్లీహిల్స్ డివిజన్ గురు బ్రహ్మనగర్​లో సంత్ సేవాలాల్ జంయతి ఉత్సవాలు

ఐపీఎల్​లో తెలంగాణ క్రీడాకారులకు జరుగుతున్న అన్యాయాలపై ఎమ్మెల్యే దానం నాగేందర్​ మండిపడ్డారు. జూబ్లీహిల్స్​లో నిర్వహించిన సంత్​ సేవాలాల్​ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న దానం... స్థానిక క్రీడాకారులకు సరైన గుర్తింపు లభించే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.

mla danam nagendar participated in santh sevalal maharaj birth anniversary in jublihills
తెలంగాణ క్రీడాకారులకు ఐపీఎల్​లో తీవ్ర అన్యాయం: దానం

By

Published : Feb 21, 2021, 1:16 PM IST

తెలంగాణ క్రీడాకారులను ఐపీఎల్​లో అంటరాని వారిగా చూస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ డివిజన్ గురు బ్రహ్మనగర్​లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న దానం... ఐపీఎల్​లో జరుగుతున్న అన్యాయాలపై మరోమారు తన గళాన్ని వినిపించారు. తెలంగాణలో ప్రతిభావంతులైన క్రీడాకారులే లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూరత్​లో నిర్వహించిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ప్రతిభ లేనివారిని ఐపీఎల్​కు ఎంపిక చేశారని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​ని కొంతమంది కబంధ హస్తాల్లో ఉంచుకొని వారి పిల్లలనే ఎంపిక చేసుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణలోని అద్భుతమైన ప్రతిభ కలిగిన క్రీడాకారులకు సరైన గుర్తింపు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్​లో వందల కోట్లు కేటాయిస్తారన్నారు. స్థానిక క్రీడాకారులకు గుర్తింపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఐపీఎల్​లో మనకు చోటు రాకపోవడానికి మల్టిపుల్ టీమ్స్​ కారణమని, దానిని అడ్డుకుంటే తప్ప ప్రతిభకు పట్టం కట్టలేమని అన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు గుర్తింపు లభించే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు.

ఇదీ చూడండి:30 లక్షలు దాటిన తెరాస సభ్యత్వాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details