గోపన్ పల్లిలో ఎస్సీల భూములను కబ్జా చేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్‌పై బురద జల్లుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్న భూమిని 2014 ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్ వెల్లడించారన్నారు.
రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఏమి పట్టుకోలేదు : బాల్క సుమన్ - mla balka suman latest news
రేవంత్ రెడ్డి కొండను ఏమి పట్టుకోలేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. గోపన్ పల్లిలో ఎస్సీల భూములను రేవంత్ బ్రదర్స్ కబ్జా చేశారని ఆరోపించారు. తనను ఓడించిన పట్నం నరేందర్ రెడ్డిని మరవలేకనే రేవంత్ రెడ్డి.. పట్నం గోస కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
balka suman
కేటీఆర్ సతీమణి పేరు మీద 8 ఎకరాల 9 గుంటల భూమి ఉందని బాల్క సుమన్ పేర్కొన్నారు. రేవంత్ చెబుతున్న భూమికి.. ఫామ్ హౌస్‌కు సంబంధం లేదని వివరించారు. కేటీఆర్‌తో పాటు తాము ఎన్నోసార్లు అక్కడికి వెళ్లామన్నారు.
ఇదీ చూడండి:ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసునమోదు