తెలంగాణ

telangana

ETV Bharat / city

ministers unhappy: మంత్రివర్గంలో దక్కనిచోటు.. రాజీనామాలకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు..! - అసంతృప్తిలో ఏపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు

ఏపీలో జగన్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణ వైకాపాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పదవులపై ఆశపెట్టుకున్న ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వారిలో మాజీ మంత్రులు సైతం ఉన్నారు. కొందరు నాయకులు అనుచరులు ఏకంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

ministers un happy
వైకాపా నాయకుల్లో అసంతృప్తి

By

Published : Apr 11, 2022, 12:47 PM IST

Ministers Unhappy: మంత్రివర్గంలో చోటు దక్కని వైకాపా నాయకుల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, అన్నా రాంబాబు, పార్థసారథి, ఉదయభాను సహా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయా నాయకుల అనుచరులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర అసంతృప్తిలో బాలినేని.. మొన్నటిదాకా మంత్రి పదవిలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఈసారి కొనసాగించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను తప్పించడంతోపాటు తమ జిల్లా నుంచి ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంపై నిన్నటి నుంచే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు విడతలుగా బాలినేని ఇంటికి వెళ్లి చర్చలు జరిపినా ఆయన శాంతించలేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియజేసేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి కాసేపట్లో మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

విజయవాడలో బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసిన మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి.. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. కార్యాచరణపై నాగార్జునరెడ్డి చర్చించారు. అలాగేకరణం బలరాం కూడా మరోసారి బాలినేనిని కలిశారు. బాలినేనికి మద్దతుగా సంతమాగులూరు మండల పరిషత్ అధ్యక్ష పదవికి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి కొటారి రామచంద్రరావు రాజీనామా సమర్పించారు. అలాగే ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్‌రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మంత్రివర్గంలో దక్కనిచోటు.. రాజీనామాలకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు..!

అదే కోవలో బాలినేనికి మద్దతుగా ఒంగోలు మేయర్‌, కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని బాలినేని అభిమానులు అన్నారు. ఆయనకు పదవి లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. 43 మంది వైకాపా కార్పొరేటర్లు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధమైనట్లు కార్పొరేట్లకు తెలిపారు. బాలినేని రాజీనామా చేస్తే అందరం రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. ఒంగోలు జడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

భవిష్యత్ కార్యాచరణపై సుచరిత చర్చలు.. మంత్రివర్గంలో మళ్లీ చోటు కల్పించకపోవడంపై మేకతోటి సుచరిత అసంతృప్తితో ఉన్నారు. ఈ మేరకు తన నివాసంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో సుచరిత ఇంటి వద్ద నిరసనలు హోరెత్తుతున్నాయి. భారీగా చేరుకున్న వైకాపా కార్యకర్తలు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.

అన్నా రాంబాబు అనుచరుల నిరసన.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నా రాంబాబుకు మంత్రి పదవి రాలేదనంటూ కంభంలో ఆయన అనుచరుల రాస్తారోకో చేశారు. అలాగే కంభంలో ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన చేపట్టారు.

పార్థసారథి నివాసానికి ఎంపీ మోపిదేవి..విజయవాడలో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నివాసానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణ వచ్చారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న పార్థసారథితో ఆయన చర్చించారు. పార్థసారథికి మంత్రి పదవి రాకపోవడంపై ఆయన అనుచరులు, పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details