హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటించారు. బాబా నగర్, ఫూల్ బాగ్, ఒమర్ కాలనీ, గాజి మిల్లత్ కాలనీ, తదితర ప్రాంతాలను స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ సుడిగాలి పర్యటన - అక్బరుద్దీన్ ఓవైసీ సుడిగాలి పర్యటన
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
![వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ సుడిగాలి పర్యటన mla akbaruddin owaisi visit flood effected areas in chandrayanagutta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9250077-591-9250077-1603207367324.jpg)
వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ సుడిగాలి పర్యటన
వర్షంలో తడుస్తూనే ముంపు ప్రాంతాల్లో అక్బరుద్దీన్ తిరిగారు. ప్రజలతో మాట్లాడి జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.