తెలంగాణ

telangana

ETV Bharat / city

మిషన్ సాగర్-2: ఎరిత్రియాకు ఆహార ప‌దార్థాల‌ు అంద‌జేత

హిందూమహాసముద్రంలోని పొరుగు దేశాలకు సహాయం అందించేందుకు సాగర్-2 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్. ఇందులో భాగంగా.. భారత్ నౌకదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ నౌక ఎరిత్రియా దేశానికి చేరుకుని.. అక్కడి ప్రజలకు ఆహార పదార్ధాలను అందించింది.

Mission Sagar ll INS Airavat carrying food aid for Eritrea
మిషన్ సాగర్ II: ఎరిత్రియాకు ఆహార ప‌దార్థాల‌ను అంద‌జేత

By

Published : Nov 7, 2020, 2:13 PM IST

Updated : Nov 7, 2020, 2:29 PM IST

మాన‌వీయ స‌హాయంలో భాగంగా.. సాగ‌ర్-2 కార్యక్రమాన్ని భార‌త్ ఆరంభించింది. భార‌త నౌకాద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావ‌త్ స్నేహ‌పూర్వ‌కంగా ఉండే పొరుగుదేశాల‌కు స‌హాయం అందించేందుకు ఆయా పోర్టుల‌కు చేరుకుంది. ప్ర‌కృతి వైప‌రీత్యాలు, కొవిడ్ మ‌హ‌మ్మారిల ‌దృష్ట్యా ఎరిత్రియా ప్ర‌జ‌ల‌కు స‌హ‌యం అందిస్తోంది. ఎరిత్రియా పోర్టు మ‌స్వకి చేరిన ఈ నౌక ఆహార పదార్ధాలను అక్కడి ప్ర‌జ‌ల‌కు అందించింది.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ముందుచూపులో భాగంగా... సాగ‌ర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫ‌ర్ అల్ ఇన్ ది రీజియ‌న్) అనే ‌కార్య‌క్ర‌మాన్ని హిందూ మ‌హా స‌ముద్ర ప్రాంతంలో భార‌త నౌకాద‌ళం ప్రారంభించింది. ఈ కార్యక్రమం భార‌త్​తో ఇత‌ర దేశాల సంబంధాలను స్నేహ‌పూరితంగా మ‌రింత పెంపొందించ‌నుంది. ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌లో ఉన్న వివిధ విభాగాల మ‌ధ్య సమ‌న్వ‌యంతో ప‌ని చేయ‌డం వ‌ల్ల ఈప్రాంతంలో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు పూర్తిగా అంద‌రికి ఉప‌యుక్తంగా ఉంటుంది. ఐఎన్ఎస్ ఐరావ‌త్ 2009లో క‌మిష‌న్ అయింది. ఈ నౌక మాన‌వీయ స‌హాయం అందించ‌డంలో పున‌రావాస స‌హాయం అందించ‌డంలో పూర్తి స్ధాయిలో నిమ‌గ్న‌మైంది.

ఇదీ చదవండి:తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ

Last Updated : Nov 7, 2020, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details