తెలంగాణ

telangana

ETV Bharat / city

RTC Bus Missing : పడుకుని లేచేసరికి ఆర్టీసీ బస్సు మాయం.. అంతలోనే..! - ఆర్టీసీ బస్సు ఆచూకీ లభ్యం

RTC Bus Missing in Vijayanagaram: విధులు ముగిశాక బస్సు పార్క్ చేసి.. డ్రైవర్​, కండక్టర్​​ నిద్రపోయారు. పొద్దున్నే లేచి డ్యూటీ ఎక్కుదామని చూస్తే బస్సు కనిపించలేదు. పడుకుని లేచేసరికి ఏకంగా బస్సు మాయం కావటంతో డ్రైవర్​, కండక్టర్​ షాకయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Missing RTC Bus Found in Vangara
Missing RTC Bus Found in Vangara

By

Published : Aug 9, 2022, 12:41 PM IST

RTC Bus Missing in Vijayanagaram : ఏపీలోని విజయనగరం జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వంగర గ్రామంలో ఆర్టీసీ బస్సు మాయం కావడం కలకలం రేపింది. అయితే కొంతసేపటికే దాని ఆచూకీ లభ్యం కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పాలకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును.. నిన్న రాత్రి వంగర గ్రామంలో సిబ్బంది నిలిపి.. అక్కడే నిద్రపోయారు. తెల్లవారి లేచి చూసేసరికి బస్సు మాయమైపోయింది. బస్సును ఎత్తుకెళ్లారంటూ.. ఆర్టీసీ డ్రైవర్ వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీసాలడోలపేట వద్ద ఆర్టీసీని పోలీసులు గుర్తించారు. బస్సును గుర్తించామని డిపో మేనేజర్‌, సీఐ ధ్రువీకరించడంతో.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఊపిరి పీల్చుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details