ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే సౌలభ్యం మనకు ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా నిలిచిపోయాయా అని అని ప్రశ్నించారు. నిన్న వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారన్నారు. ప్రధాని మోదీ ఆన్లైన్లో సమీక్షలు జరపడం లేదా అని నిలదీశారు.
నూటికి 70శాతం మందికి కరోనా సోకుతుంది: తలసాని
ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కరోనా వైరస్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
నూటికి 70శాతం మందికి కరోనా సోకుతుంది: తలసాని
రాష్ట్రం గౌరవానికి తగినట్టు సచివాలయం ఉంటే తప్పా అని తలసాని ప్రశ్నించారు. నూటికి 70శాతం మందికి కరోనా సోకుందన్న మంత్రి... ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. చాలా మందికి వారికి తెలియకుండానే ఇప్పటికే కరోనా వచ్చి తగ్గి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి :ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం
Last Updated : Jul 9, 2020, 3:26 PM IST
TAGGED:
TALASANI