తెలంగాణ

telangana

ETV Bharat / city

'పోలవరంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు' - పోలవరం తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి... కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రితో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్‌కుమార్‌ దిల్లీలో భేటీ అయ్యారు. పోలవరం కొత్త డీపీఆర్ ఆమోదంపై చర్చించారు. ఇప్పటికే కొత్త డీపీఆర్‌పై రాష్ట్రప్రభుత్వ వాదనలతో కూడిన వివరాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ పంపిందని తెలిపారు. మొత్తం రూ.47వేల 725 కోట్లకు త్వరగా ఆమోదం తెలపాలని మంత్రులు కోరారు.

minsiters-buggana-anil-meets-jal-shakti-minister
'పోలవరంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు'

By

Published : Dec 11, 2020, 5:16 PM IST

'పోలవరంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు'

దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై కేంద్ర మంత్రితో చర్చించామని మంత్రి అనిల్‌ కుమార్ తెలిపారు. 2017లో జరిగిన పొరపాట్ల వల్ల పోలవరానికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.

ఆ పొరపాట్ల గురించి కేంద్రమంత్రికి వివరించామన్న ఆయన... 2017 నాటి పొరపాట్లపై అవగాహన ఉందని షెకావత్ చెప్పారన్నారు. పోలవరం ముందుకెళ్లేలా చూస్తామని కేంద్రమంత్రి చెప్పారన్నారు.

'పోలవరం ప్రాజెక్టులో తాగునీటి భాగాలు తొలగించారు, వాటిని ఉంచాలని కోరాం. విభజన చట్టంలో పోలవరంపై తాగునీటి అవసరాల అంశం కూడా ఉంది. పరిహారం, పునరావాసంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్రమంత్రి షెకావత్‌ను పోలవరం సందర్శించాలని కోరాం. పోలవరానికి 15 రోజుల్లోగా వస్తామని కేంద్రమంత్రి చెప్పారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టు పూర్తి చేస్తాం'

---అనిల్ కుమార్ యాదవ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి

ప్రత్యేక ప్యాకేజి ఒప్పుకోవడం వల్లే ఈ సమస్య : బుగ్గన

రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నిధులపై కేంద్రమంత్రులను కలుస్తున్నామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకోవడం వల్లే పోలవరానికి సమస్య వచ్చిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటీ పరిష్కరిస్తున్నామన్నారు.

ఇదీ చూడండి:రైతు ఖాతాలో 4 వందల కోట్లు... చేతికి పైసా రావట్లేదు...!

ABOUT THE AUTHOR

...view details