పదిహేడేళ్ల వయసులో ప్రేమలో పడిన బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లినే కడతేర్చింది. ఇద్దరు మైనర్లు ఓ నిండుప్రాణాన్ని బలిగొన్న ఉదంతం రాజధానిలో సంచలనం సృష్టించింది. హైదరాబాద్ చింతల్‌మెట్లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, సీఐ కనకయ్యలు తెలిపిన వివరాల మేరకు...చింతల్‌మెట్లో నివసించే దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తె వివాహం చేశారు. చిన్న కుమార్తె (17) స్థానికంగా ఉండే ఓ బాలుడి(17)తో ప్రేమలో పడింది. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో పలుమార్లు మందలించింది. అతడితో తిరగొద్దని సోమవారం మధ్యాహ్నం మరోసారి చెప్పింది.
ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపిన కుమార్తె - హైదరాబాద్ తాజా వార్తలు
హయత్నగర్ ఘటన మరవకముందే అలాంటి ఘటనే మరోసారి జరిగింది. ప్రియుడితో కలిసి కన్న కూతురే తల్లిని చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పదిహేడేళ్ల మైనర్ బాలిక.. అదే తరహాలో ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపేసింది.
తల్లి మందలించగానే అక్కడికి బాలుడిని పిలిపించుకున్న బాలిక తల్లితో తీవ్ర వాగ్వాదం పెట్టుకుంది. తర్వాత తల్లి మెడకు చున్నీ చుట్టి బాలుడి సహాయంతో హత్య చేసింది.అనంతరం తన తల్లి కిందపడి చనిపోయిందని చుట్టుపక్కల వారికి తెలిపింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఇంట్లో లేరు. ఆయనతో పాటు స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడిని, బాలికను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు.
ఇదీ చదవండి :మొటిమలున్న స్త్రీలకు శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయా?