తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2021, 5:17 PM IST

ETV Bharat / city

sunilkumar: ఏపీ సీఐడీ అదనపు డీజీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర హోంశాఖ

ఆంధ్రప్రదేశ్​ సీఐడీ అదనపు డీజీ సునీల్​కుమార్​ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులపై నివేదిక అందించాలని కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలు తెలపాలంటూ సీఎస్​కు లేఖ రాసింది.

'సునీల్​కుమార్​పై వచ్చిన ఫిర్యాదులపై నివేదిక అందించాలి'
'సునీల్​కుమార్​పై వచ్చిన ఫిర్యాదులపై నివేదిక అందించాలి'

ఏపీ సీఐడీ (AP CID) అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్‌కుమార్ వ్యవహారంపై వచ్చిన 3 ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్​ను ఆదేశించింది. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలు కోరుతూ సీఎస్‌కు లేఖ రాసింది.

సివిల్ సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో సునీల్‌పై ఎంపీ రఘురామ (MP raghurama) ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ హోదాలో సమాజంలో అలజడి సృష్టించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామ ఫిర్యాదు, సునీల్‌ ప్రసంగ వీడియోలను కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి పంపింది. ఫిర్యాదు (complaint) ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎస్​ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో తమకు చెప్పాలని ఆదేశించింది. సునీల్‌ మత వ్యతిరేక ప్రచారం చేశారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్జర్వేటరీ గతంలో ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి:Revanth Reddy: ఎవరైనా తెలంగాణ వారే.. తేడా ఉండదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details