నేషనల్ డిజైన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం సుముఖంగా ఉందని... కేంద్రం ఆ దిశగా సహకరించాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న వరల్డ్ డిజైన్ ఫోరంలో ఆయన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి పాల్గొన్నారు. 31వ ఎడిషన్ వరల్డ్ డిజైన్ ఫోరం కొరకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
'గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ సెంటర్‌గా ఎదుగుతున్న హైదరాబాద్'
యానిమేషన్ డెస్టినేషన్, గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ సెంటర్‌గా హైదరాబాద్ ఎదుగుతోందని... స్థానిక డిజైనర్లు, అంతర్జాతీయ డిజైనర్లతో కలిసి పనిచేసేందుకు ఇటువంటి సదస్సులు దోహదం చేస్తాయని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డిజైనర్ స్టాళ్లలో ఆయన కలియతిరుగుతూ.. బిల్డింగ్ కన్స్ట్రక్చర్స్, ఆర్గనైజర్లతో కేటీఆర్ ముచ్చటించారు. ఇవాల్టితో ఈ వరల్డ్ డిజైన్ సదస్సు ముగియనుంది.
వరల్డ్ డిజైన్ ఫోరంలో పాల్గొన్న మంత్రులు ఇవీ చూడండి: 'ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు'