ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించాలని రాష్ట్ర మంత్రులు ఆర్కియాలజీ విభాగాన్ని కోరారు. దిల్లీలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌తో ముగ్గురు మంత్రులు భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో భాగంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, ఎంపీ కవిత... ఎఎస్ఐ- డీజీ(ASI-DG)ని కలిసి విజ్ఞప్తి చేశారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ హెరిటేజ్ గుర్తింపు ప్రక్రియకు సహకరించాలని రాష్ట్ర బృందం విన్నవించింది.
RAMAPPA: 'రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించండి' - రాష్ట్ర మంత్రుల బృందం
దిల్లీలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. నిన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్‌ను కలిసిన నేతల బృందం.. ఇవాళ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డీజీని కలిశారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
![RAMAPPA: 'రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించండి' ministers-meet-asi-dg-in-delhi-for-ramappa-temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12245959-77-12245959-1624523055301.jpg)
ministers-meet-asi-dg-in-delhi-for-ramappa-temple
ఇప్పటికే కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్‌ను కలిసిన నేతల బృందం.. వినతిపత్రం సమర్పించారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని 'యూనెస్కో వరల్డ్ హెరిటేజ్' స్థలంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని నేతల బృందం విజ్ఞప్తి చేసింది. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ కేంద్రంగా ప్రకటించేందుకు అవసరం అయిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను మంత్రుల బృందం కోరింది