తెలంగాణ

telangana

ETV Bharat / city

'అన్నిజిల్లాలో టూరిజం.. ప్రతి రిజర్వాయర్​ దగ్గర బోటింగ్' - హుస్సేన్ సాగర్​లో క్రూయిజ్ రెస్టారెంట్ ప్రారంభం

హుస్సేన్​సాగర్​లో క్రూయిజ్​ రెస్టారెంట్​ బోట్​ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్​ అలీ ప్రారంభించారు. ప్రతి జిల్లాలో చిన్న తరహా టూరిజం, అన్ని రిజర్వాయర్ల దగ్గర బోటింగ్ సదుపాయం కల్పించనున్నట్టు శ్రీనివాస్ గౌడ్​ వెల్లడించారు.

ministers launched cruise restaurant boat in Hussain sagar
'అన్నిజిల్లాలో టూరిజం.. ప్రతి రిజార్వాయర్​ దగ్గర బోటింగ్'

By

Published : Feb 2, 2021, 5:39 PM IST

ప్రతి జిల్లాలో చిన్న తరహా టూరిజం సర్క్యూట్​ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హుస్సేన్​సాగర్​లో ఆధునాతన హంగులతో కూడిన క్రూయిజ్ రెస్టారెంట్ బోట్... ఆర్యతార​ను హోంమంత్రి మహమూద్​ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ బోట్​లో 80 మంది కూర్చోవచ్చునని, ఒకే సారి 30 మంది భోజనం చేసే సదుపాయం ఉన్నట్టు తెలిపారు.

కాలుష్యరహితంగా ఉండే ఎలక్ట్రికల్ బ్యాటరీతో పనిచేసే క్రూయిజ్ రెస్టారెంట్ బోట్ త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతి రిజర్వాయర్ దగ్గర బోటింగ్ సదుపాయం కల్పించనున్నట్టు మంత్రి వెల్లడించారు. బోటింగ్​తో పాటు వాటర్ స్పోర్ట్స్ కూడా అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు. దీనికోసం గోవాకు చెందిన నిపుణులతో ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి:శెభాష్​ శిరీషా.. మానవత్వాన్ని చాటారు : హోం మంత్రి కిషన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details