రాష్ట్రంలో కీలక వ్యవసాయ రంగానికి ఓ రూప సౌందర్యం వచ్చిందని మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సర్కారు అవలంభిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాల వల్ల.. గుణాత్మక మార్పు కనిపిస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో ఆధునిక యువ రైతుల పెళ్లి కోసం అమ్మాయిని ఇచ్చే రోజులు వస్తాయని.. అలాంటి వరుడ్నే వధువులు కోరుకుంటారని ఆకాంక్షించారు. హైదరాబాద్ అబిడ్స్ రెడ్డి హాస్టల్లో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు.
'రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఓ రూప సౌందర్యం వచ్చింది' - telangana varthalu
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సర్కారు అవలంభిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాల వల్ల గుణాత్మక మార్పు కనిపిస్తోందని మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి ఓ రూప సౌందర్యం వచ్చిందన్నారు.

'రాష్ట్రంలో వ్యవసాయరంగానికి ఓ రూప సౌందర్యం వచ్చింది'
ఈ సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా వ్యవసాయ డైరీ, క్యాలెండర్ - 2021 ఆవిష్కరించారు. వ్యవసాయ శాఖ చూస్తే స్ఫూర్తి కలుగుతుందని... వ్యవసాయాధికారులు పదవీ విరమణ తర్వాత కూడా.. రైతులను ప్రోత్సహించడంలో నిమగ్నమవుతున్నతీరు అభినందనీయమని హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యవసాయశాఖలో పదోన్నతుల ప్రక్రియ ఇప్పటికే మొదలుపెట్టమని ఆదేశాలిచ్చామని... మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
'రాష్ట్రంలో వ్యవసాయరంగానికి ఓ రూప సౌందర్యం వచ్చింది'
ఇదీ చదవండి:50వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు: హరీశ్‌రావు