తెలంగాణ

telangana

ETV Bharat / city

నాయిని నర్సింహారెడ్డికి మంత్రుల పరామర్శ - నాయిని నర్సింహారెడ్డి తాజా వార్తలు

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పలువురు మంత్రులు పరామర్శించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరింత మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు మంత్రులు సూచించారు.

నాయినిని పరామర్శించిన మంత్రులు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
నాయినిని పరామర్శించిన మంత్రులు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

By

Published : Oct 20, 2020, 3:34 PM IST

అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెరాస నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పలువురు మంత్రులు, నేతలు మంగళవారం పరామర్శించారు. మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు.

నాయిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరింత మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. నాయిని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఇవీ చూడండి:మాజీ హోంమంత్రి నాయినికి కేటీఆర్ పరామర్శ

ABOUT THE AUTHOR

...view details