బుల్లెట్టు బండి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట మార్మోగుతోంది. వేడుకేదైనా.. ఈ పాట ఉండాల్సిందే.. చిన్నా పెద్దా అందరూ.. చిందులేయాల్సిందే. హుషారెత్తించే ఈ పాటకు తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సతీమణి.. డాన్స్ వేశారు. నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవాన్ని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు.
Ap Deputy CM WIFE DANCE : బుల్లెట్ బండి పాట.. ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి ఆట - బుల్లెట్టు బండి న్యూస్
బుల్లెట్టు బండి పాటకు ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సతీమణి డ్యాన్స్ వేశారు. బుధవారం రోజున మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవం వేడుకల్లో ఇలా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
బుల్లెట్ బండి పాట.. ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి ఆట
ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్టు బండి పాటకు నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. మంత్రి సతీమణి డ్యాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.