కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ పరిధిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హెచ్ఎఎల్ కాలనీ, వీనస్ ఎంక్లేవ్, రావి నారాయణరెడ్డి నగర్లలో పర్యటించారు.
గాజుల రామారం డివిజన్లో తెరాస బలపర్చిన కార్పొరేటర్ అభ్యర్థి రావుల శేషగిరి రావుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి వేముల కోరారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు. నిరంతరం ప్రజల కోసమే పనిచేసే తెరాస పార్టీకి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.