సచివాలయం, అమరవీరుల స్మారక స్థూపాన్ని గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని రహదారులు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం అధికారులు, ఇంజనీర్లు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ్‌తో సమావేశమైన మంత్రి... నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు.
తెలంగాణ ఆత్మగౌరవంగా అమరుల స్మారక స్థూపం: వేముల - అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష
సచివాలయం, అమరవీరుల స్మారక స్థూపాల నిర్మాణ పనులపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులు, నిర్మాణ సంస్థను ఆదేశించారు.
తెలంగాణ ఆత్మగౌరవంగా అమరుల స్మారక స్థూపం: వేముల
ఈ రెండు నిర్మాణాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులు, నిర్మాణ సంస్థను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం అవుతున్న అమరవీరుల స్మారక స్థూపం... తెలంగాణ ఆత్మగౌరవంగా నిలువనుందన్నారు.
ఇదీ చూడండి:పాడి పరిశ్రమపై చిన్నచూపు ఎందుకు..?: ఎంపీ కోమటిరెడ్డి