తెలంగాణ

telangana

ETV Bharat / city

రహదారుల నిర్వహణలో అలసత్వం వద్దు : మంత్రి వేముల - మంత్రి ప్రశాంత్ రెడ్డి వార్తలు

మూల మలుపులు, ప్రమాదాలు జరిగే చోట వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. రహదారుల నిర్వహణలో అలసత్వం వహించొద్దని సూచించారు. పుణే-హైదరాబాద్ జాతీయ రహదారి -65 నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

minister vemula prasanth reddy
minister vemula prasanth reddy

By

Published : Sep 28, 2020, 9:25 PM IST

రహదారుల నిర్వహణలో అలసత్వం వహించొద్దని అధికారులకు రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. పుణే-హైదరాబాద్ జాతీయ రహదారి -65 నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

ఆ వాహనాలకు ప్రత్యేక లైన్లు ఉండాలి

జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల నిర్వహణ, అసంపూర్తిగా ఉన్నప్పటికీ.. టోల్ వసూలు చేయడం, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. వాటిని నివారించాలని మంత్రిని కోరారు. కోమ్ కోల్ టోల్ ప్లాజాకు 4 జతల లైన్లు ఉన్నాయి కానీ.. అందులో కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయని మంత్రి దృష్టికి ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ తీసుకొచ్చారు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు ప్రత్యేక లైన్ లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. దీనికి సంబంధించి మరో రెండు లైన్ల నిర్మాణం పురోగతిలో ఉందని... గుల్బర్గా జాతీయ రహదారి పీడీ వివరించారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

అన్ని లైన్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఒక లైన్‌ను అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకోసం కేటాయించాలని మంత్రి సూచించారు. వీయూపీలు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. దానికి సంబంధించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

వెంటనే పూర్తి చేయండి

సత్వార గ్రామంలో మూల మలువు వద్ద సరిగ్గా కన్పించడంలేదని ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. మూల మలుపులు, ప్రమాదాలు జరిగే చోట వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మల్కాపూర్ గ్రామంతో పాటు ఇతర ప్రాంతాల్లో పూర్తిచేయకుండానే టోల్ వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ తెలిపారు. మిగిలిన భాగాన్ని వెంటనే పూర్తిచేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి :ఇందూరు ఎమ్మెల్సీ ఉపఎన్నికే లక్ష్యంగా తెరాస వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details